కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 60,26,400 దాటింది. 3,66,400 మందికి పైగా కొవిడ్-19కు బలయ్యారు. వ్యాధి నుంచి 26,56,000పైగా కోలుకున్నారు.
అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 17,93,500 దాటింది. 24 గంటల్లో 25,000పైగా బాధితులుగా మారారు. మరో 1,225 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,04,500 మందికి పైగా ఉంది.
బ్రెజిల్లో 29,000 పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,68,000 దాటింది. 27,944 మంది కన్నుమూశారు.