ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా సాగుతోంది. కేసుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరువగా ఉంది. శనివారం సాయంత్రానికి మరో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 1,523 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8.42 లక్షలకు చేరింది.
- మొత్తం కేసులు2,49,55,493
- మరణాలు8,42,200
- కోలుకున్నవారు1,73,38,147
- యాక్టివ్ కేసులు67,75,146
- అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటిపోయింది. అత్యధికంగా ఈ దేశంలోనే 1,85,986 మంది మరణించారు. ప్రస్తుతం 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- బ్రెజిల్లో కేసుల సంఖ్య 40 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటికే దేశంలో 3.8 లక్షల మందికి మహమ్మారి సోకగా... లక్షా 19 వేల మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో ఇవాళ 323 కేసులు గుర్తించారు అధికారులు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 19,400కి చేరింది. మరో అయిదుగురు మరణించడం వల్ల మొత్తం మరణాల సంఖ్య 321కి పెరిగిపోయింది.
- మలేసియాలో కరోనా ఆంక్షలను ఈ ఏడాది చివరి వరకు కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ పర్యటనలపై నిషేధం కొనసాగించింది. ఇప్పటివరకు దేశంలో 9 వేలకు పైగా కేసులు, 125 మరణాలు రికార్డయ్యాయి.
- నేపాల్లో మరో 12 మంది కరోనా మహమ్మారి ధాటికి బలయ్యారు. కొత్తగా 884 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మరణాల సంఖ్య 207కి చేరగా.. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 37,340కి ఎగబాకింది. ప్రస్తుతం 16,578 యాక్టివ్ కేసులు ఉన్నాయి.