ప్రపంచంపై కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 33 లక్షలు దాటింది. అయితే.. ఇప్పటివరకు కోటిన్నర మందికిపైగా.. వైరస్ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.
- అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 58.40 లక్షలు దాటింది. లక్షా 80 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 31.45 లక్షల మందికి పైగా వైరస్ నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు.
- బ్రెజిల్లో వైరస్‌కు అడ్డుకట్ట పడటం లేదు. రోజూ వేల సంఖ్యలో బాధితులు బయటపడుతూనే ఉన్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 35.82 లక్షలు దాటింది. లక్షా 14వేల మందికి పైగా మరణించారు. 27 లక్షల మంది కోలుకున్నారు.
- రష్యాలో కొత్తగా 4,921 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 121 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,51,897కు, మరణాలు 16,310కి చేరాయి. అయితే.. 7.67 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
- మెక్సికోలో తాజాగా 5,928 కేసులు వెలుగుచూశాయి. 504 మంది మంది ప్రాణాలు కోల్పోయారు.. మొత్తం 5,49,734 మంది బాధితులు ఉన్నారు. ఫలితంగా మరణాలు 59,610కు చేరాయి. అయితే.. 3.76 లక్షల మందికి వైరస్ నయం అయ్యింది.
- కొలంబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి 5,33,103 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు.దేశవ్యాప్తంగా 16,968 మంది ప్రాణాలు కోల్పోయారు.