ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2.24 కోట్లకు చేరువైంది. 7.85 లక్షల మంది మరణించగా.. కోటిన్నర మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్‌లో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి.
2.24 కోట్లకు చేరువలో కరోనా కేసులు
By
Published : Aug 19, 2020, 7:59 PM IST
ప్రపంచంపై కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2.24 కోట్లకు చేరువయ్యింది. అయితే.. ఇప్పటి వరకు కోటిన్నర మందికిపైగా.. వైరస్ నుంచి కోలుకోవటం ఊరటకలిగిస్తోంది.
మొత్తం కేసులు: 22,358,484
మరణాలు: 785,322
కోలుకున్నవారు: 15,095,485
యాక్టివ్ కేసులు: 6,477,677
అమెరికాలో.. కరోనా కేసుల సంఖ్య 56 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు లక్షా 75 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 30 లక్షలకుపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
బ్రెజిల్లో.. వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 34 లక్షలు దాటింది. లక్షా 10వేల మంది మరణించారు. 25.54 లక్షల మంది కోలుకున్నారు.
న్యూజిలాండ్‌లో.. కరోనా మహమ్మారి మళ్లీ వ్యాప్తి చెందుతోంది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో బుధవారం కొత్తగా 5 కేసులు బయటపడ్డాయి. ఖతార్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. 102 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదవటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లో బుధవారం కొత్తగా 613 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 11 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,90,445కు, మరణాలు 6,201కి చేరాయి. అయితే.. 2,72,128 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
సింగపూర్‌లో బుధవారం కొత్తగా 93 వైరస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. అందులో చాలా మంది విదేశీ కార్మికులేనని అధికారులు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 56,031కి చేరింది.
ఇరాన్లో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటింది. పశ్చిమాసియా దేశాల్లో అత్యధిక మరణాలు ఇరాన్‌లోనే సంభవించాయి.