కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద దేశాలు అనే తేడా లేకుండా అన్నింటా తన ప్రభావాన్ని చూపుతోంది. రోజుకు మూడు లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. అయితే.. అదే స్థాయిలో వైరస్ నుంచి కోలుకోవటం ఊరట కలిగించే విషయం.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 93 లక్షలు దాటింది. 7.18 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 19,303,114
- మరణాలు: 718,511
- కోలుకున్నవారు: 12,393,763
- యాక్టివ్ కేసులు:6,190,840
అమెరికాలో ఉగ్రరూపం..
అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు 60-80 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. 1.62లక్షల మందికిపైగా మరణించారు. 25 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
బ్రెజిల్లో...
కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 29 లక్షలు దాటింది. మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. 20 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.