ప్రపంచవ్యాప్తంగా కోటీ 32 లక్షల 69 వేల మందికిపైగా కరోనా సోకింది. ఇప్పటివరకు 5.76 లక్షల మందికిపైగా వైరస్ బారినపడి మరణించారు. అమెరికా, బ్రెజిల్, రష్యా, పెరూ వంటి దేశాలపై కరోనా ప్రభావం అధికంగా ఉంది.
రష్యాలో మరో 6 వేల కేసులు
రష్యాలో ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. రోజూ 6 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 6,248 మందికి వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,39,947కు చేరింది. మరో 175 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా 11,614 మంది వైరస్‌కు బలైనట్లు అధికారులు తెలిపారు. 5,12,825 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పాక్‌లో విజృంభణ..
పాకిస్థాన్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 1,979 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2,53,604కు, మరణాలు 320కి చేరాయి. ఇప్పటి వరకు 1,70,656 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.