తెలంగాణ

telangana

ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. ​మొత్తం కేసులు కోటీ 30 లక్షలు దాటాయి. ఇప్పటివరకు 5 లక్షల 71 వేలమందికిపైగా వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో కరోనా మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

By

Published : Jul 13, 2020, 7:43 AM IST

Published : Jul 13, 2020, 7:43 AM IST

Global COVID-19 tracker
అమెరికాపై కరోనా పంజా.. ఒక్కరోజులో 58 వేల కేసులు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్​కు గడగడలాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,32,688 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,71,356 మంది వైరస్​కు బలయ్యారు.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట పడటం లేదు. ఒక్కరోజులో 58 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34 లక్షల 14 వేలకు చేరువైంది. ఆదివారం మరో 380 మంది మృతి చెందగా... మొత్తం లక్షా 37 వేల మందికి పైగా మరణించారు.
  • బ్రెజిల్​లో వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజులో అక్కడ మరో 25 వేల కేసులు, 659 మరణాలు నమోదయ్యాయి.
  • మెక్సికోలో తాజాగా 6 వేల కేసులు నమోదుకాగా... మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది.
దేశం కేసులు మరణాలు
అమెరికా 34,13,995 1,37,782
బ్రెజిల్ 18,66,176 72,151
రష్యా 7,27,162 11,335
పెరు 3,26,326 11,870
చిలీ 3,15,041 6,979
స్పెయిన్ 3,00,988 28,403
మెక్సికో 2,95,268 34,730
బ్రిటన్ 2,89,603 44,819

ABOUT THE AUTHOR

...view details