తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విజృంభణ.. అమెరికా​లో మరో 57 వేల కేసులు - ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. మొత్తం​ కేసులు కోటీ 9 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 5 లక్షల 24 వేలు దాటింది. అమెరికాలో కొత్తగా 57 వేల కేసులు, 687 మరణాలు సంభవించాయి. బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికోల్లోనూ భారీ స్థాయిలో కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి.

Global COVID-19 tracker
కరోనా విజృంభణ.. యూఎస్​లో కొత్తగా 57 వేల కేసులు

By

Published : Jul 3, 2020, 9:50 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. తాజాగా మొత్తం కరోనా కేసులు కోటీ 9 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 5 లక్షల 24 వేలకు పెరిగింది.

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా అక్కడ 57 వేల కొవిడ్ కేసులు, 687 మరణాలు సంభవించాయి. కేవలం ఆరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లోనే గురువారం.. 25 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 28 లక్షల 37 వేలకు, మరణాల సంఖ్య లక్షా 31 వేలకు పైగా పెరిగింది.

బ్రెజిల్ అతలాకుతలం

బ్రెజిల్​లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్కడ 47 వేల 9 వందలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా, 1277 మంది మృత్యువాతపడ్డారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగాయి. మరణాల సంఖ్య 61 వేల 990కి చేరింది.

రష్యాలో మరో 6,760 కేసులు నమోదయ్యాయి. 147 మరణాలు సంభవించాయి. మెక్సికోలో గడచిన 24 గంటల్లో 6,741 కేసులు, 679 మరణాలు నమోదయ్యాయి.

కిమ్​ హెచ్చరిక

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​... కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పట్ల అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

ఇదీ చూడండి:మయన్మార్ గని ప్రమాదంలో 162కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details