తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో​ కరోనా మరింత తీవ్రం.. ఒక్కరోజే 30 వేల కేసులు - covid-19 latest news

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువైంది. 4.23 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్​, బ్రిటన్​ దేశాల్లో మరణాల సంఖ్య 41 వేలు దాటింది.

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా 76 లక్షలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Jun 12, 2020, 7:48 AM IST

Updated : Jun 12, 2020, 8:06 AM IST

కొవిడ్​-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్షకుపైగా కేసులు నమోదవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు మొత్తం 4.23 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి.

మరణాల్లో బ్రెజిల్​, బ్రిటన్​లు దూసుకెళ్తున్నాయి. ఇరు దేశాల్లో మరణాల సంఖ్య 41వేలు దాటింది. అమెరికా, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. భారత్​లోనూ ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. బ్రెజిల్​లో గడచిన 24 గంటల్లో మరో 30 వేలకుపైగా కేసులు, 12 వందలకుపైగా మరణాలు సంభవించాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలు

ఇదీ చూడండి: బ్రిటన్​, స్పెయిన్​లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి..

Last Updated : Jun 12, 2020, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details