ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక లక్ష 34 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 74.44 లక్షలు దాటింది. 4.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది.
ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు - corona death toll
ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లోనే లక్షా 34 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు చేరువైంది. 4 లక్షల 18 వేల మందికిపైగా మరణించారు.
![ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు Global COVID-19 tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7566043-162-7566043-1591837352990.jpg)
ప్రపంచంపై కరోనా పంజా