తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్​ను దాటేసిన రష్యా.. ఒక్కరోజే 11 వేలకుపైగా కేసులు

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 12 లక్షల 92 వేలు దాటింది. ఇప్పటివరకు 76 వేలమందికిపైగా బలయ్యారు. జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2,448 మరణాలు సంభవించాయి. రష్యాలో ఒక్కరోజు కేసులు 11 వేలు దాటాయి. మొత్తం కేసుల్లో ఫ్రాన్స్​ను దాటి ఐదో స్థానానికి చేరింది రష్యా.

Global COVID-19 tracker
ఫ్రాన్స్​ను దాటేసిన రష్యా.. ఒక్కరోజే 11 వేలకుపైగా కేసులు

By

Published : May 8, 2020, 6:55 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. 39 లక్షల మందికి పైగా కొవిడ్ సోకగా... ఇప్పటివరకు 2 లక్షల 70 వేల మంది మరణించారు. 13 లక్షల 41 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో మరో 29 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 12 లక్షల 92 వేలు దాటింది. 76 వేల 928 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లోనే మరో 2448 మంది మరణించినట్లు జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ వెల్లడించింది.

ఫ్రాన్స్​ను దాటి...

కరోనా కేసుల పరంగా ప్రపంచంలో ఐదో స్థానానికి రష్యా చేరిపోయింది. గురువారం ఒక్కసారిగా 11,231 కొత్త కేసులు వచ్చాయి. మునుపెన్నడూ 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు రాలేదు. వీటితో కలిపి రష్యాలో కరోనా బాధితుల సంఖ్య 1,77,160కి పెరిగింది. ఇప్పటివరకు 1625 మంది చనిపోయారు. కేసులు, మరణాల్లో సగానికి పైగా ఒక్క మాస్కోలోనే ఉన్నాయి. ఒక్కరోజులో 6703 మందికి కరోనా సోకడంతో మాస్కోలో మొత్తం కేసుల సంఖ్య 92,676కి ఎగబాకింది.

పరీక్షల్ని రెట్టింపు చేయడం వల్లనే కేసులు పెరిగాయని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెబుతుండడం విశేషం.

బ్రిటన్​లో...

ఐరోపాలో వైరస్‌కు అతిపెద్ద హాట్‌స్పాట్‌గా మారిన బ్రిటన్‌లో.. మరో 5,600 మంది కరోనా బారిన పడ్డారు. 30 వేల 6 వందల మంది మరణించగా.. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 6వేలు దాటింది.

  • స్పెయిన్‌లో 3 వేలకుపైగా కొత్తగా కేసులు నమోదుకాగా... మృతుల సంఖ్య 26వేలు దాటింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య.. 2 లక్షల 57 వేలకు చేరువలో ఉంది.
  • ఇటలీలో మరో14 వందల మందికి వ్యాధి సోకింది. బాధితుల సంఖ్య 2లక్షల 15 వేల 800 దాటింది. మృతుల సంఖ్య 30వేలకు చేరింది.
  • టర్కీలో.. 19 వందల మంది కొత్త వారికి కరోనా సోకగా కేసులు లక్షా 33వేలు దాటాయి. 3వేల 641 మంది చనిపోయారు.
  • సౌదీలో 17వందలకుపైగా కొత్తగా కేసులు నమోదుకాగా... బాధితుల సంఖ్య 33వేల 731కి పెరిగింది.
  • 24 గంటల వ్యవధిలో ఇరాన్​​లో 68, బెల్జియంలో 76, నెదర్లాండ్స్​లో 84 మంది చనిపోయారు.
  • పాకిస్థాన్​లో కొత్తగా 1430 మందికి వైరస్​ సోకగా... మరో 41 మంది చనిపోయారు. సింగపూర్​లో ఇప్పటివరకు 20 వేల 939 మంది కరోనా బారినపడ్డారు. 20 మరణాలు నమోదయ్యాయి.

నల్ల జాతీయులకు ఎక్కువ ముప్పు

బ్రిటన్‌లో ఇతరులతో పోలిస్తే నల్ల జాతీయులకు కరోనా ముప్పు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని గురువారం ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆఫ్రికా దేశాలకు చెందినవారు మృత్యువాత పడే అవకాశం 4.3 రెట్లు ఎక్కువని తెలిపింది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు చెందిన వారికీ ప్రాణనష్టం ముప్పు ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details