ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 42 లక్షలకు చేరువైంది. దాదాపు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, పెరు వంటి దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
కరోనా విలయం
By
Published : Jul 18, 2020, 9:25 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. మొత్తం కేసుల సంఖ్య కోటీ 42 లక్షలకు చేరువైంది. సుమారు 6 లక్షల మంది మృతి చెందారు.
మొత్తం కేసుల సంఖ్య : 14,189,223
మొత్తం మరణాలు: 599,341
కోలుకున్నవారు: 8,455,206
యాక్టివ్ కేసులు: 5,134,676
అమెరికాలో..
ఇప్పటికే కేసులు, మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న అమెరికాలో.. వైరస్ ఉద్ధృతి తగ్గటం లేదు. రోజు రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 37 లక్షలు దాటింది. మరణాలు 1.42 లక్షలు దాటాయి. 17 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
బ్రెజిల్..
కేసుల పరంగా రెండో స్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్. కొత్త కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 20 లక్షలు దాటాయి. దాదాపు 78 వేల మంది మరణించారు.
రష్యాలో..
రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల పరంగా నాలుగో స్థానానికి చేరుకుంది రష్యా. మొత్తం కేసుల సంఖ్య ఏడున్నర లక్షలు దాటింది. 12వేలకుపైగా మరణాలు సంభవించాయి.