కరోనా ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ ధాటికి 25 లక్షల మంది చనిపోయారు. గురువారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా 25,01,626 మంది మృతి చెందారని హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అందులో అమెరికాలోనే 20 శాతం మరణాలు నమోదైనట్లు పేర్కొంది. యూఎస్‌లో 5,06,500 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల్లో కూడా అగ్రరాజ్యమే ముందజలో ఉంది. అక్కడ మొత్తంగా 2,83,48,259 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 25 శాతం.
అమెరికా తర్వాత బ్రెజిల్లో అత్యధికంగా 2,49,957 మంది వైరస్‌కు బలయ్యారు. కరోనా మరణాల్లో మెక్సికో భారత్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఆ దేశంలో కొవిడ్ వల్ల 1,82,815 మంది మృతి చెందారు.