అర్ధరాత్రి.. తెల్లవారితే మే 13. ఎమిలీ అనే చిన్నారి ఏడుస్తూ నడుస్తోంది. ఎటు వెళ్లాలో తెలీదు. కాలికి బురద. ఓ కాలి షూ లేదు. దాహం వేస్తోంది. చుట్టుపక్కల చుక్కనీరు లేదు. ఆరు గంటలు అలా నడుస్తునే ఉంది. తను ఎటుపోతున్నానో తెలియదు కానీ సరిగ్గా టెక్సాస్ సరిహద్దుకు చేరుకుంది. తనలాగే చాలా మంది పిల్లలు వెళుతున్నారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఏడుస్తున్న ఎమిలీని గమనించాడు. ఎటుపోతున్నావు అని అడిగాడు. తెలియదు అనే సమాధానం. తన తల్లి ఫోన్ నెంబర్ పోగొట్టుకున్నానని, అమ్మ ఎక్కడుంటుందో కూడా తెలియదని చెప్పింది. దాంతో ఆ చిన్నారిని ప్రభుత్వ డిటెన్షన్ క్యాంప్‌లో ఉంచాడు ఆ సిబ్బంది.
"మా అమ్మ కచ్చితంగా నా కోసం ఎదురుచూస్తుంది. నా ఫోటోను టీవీలో వేస్తే తప్పక వస్తుంది."
-ఎమిలీ
వలసదారుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ఓ వార్తా సంస్థ.. అందరిలాగే ఎమిలీ ఫొటోను టీవీలో ప్రసారం చేసింది.
ఆరేళ్ల తర్వాత తన కూతుర్ని కలుసుకోవాలని రాసి ఉందో ఏమో తెలియదు. ఆ సాయంత్రమే ఎమిలీ తల్లి గ్లెండా వాల్డెజ్ టీవీ చూస్తోంది. అకస్మాత్తుగా ఎర్రటి దుస్తువుల్లో కనిపించిన చిన్నారి ఫొటో చూసింది. 9 ఏళ్ల ఆ చిన్నారి తన కూతురేనని గ్రహించింది. అధికారులకు, వలసదారుల శిబిరానికి ఫోన్లు చేయడం మొదలెట్టింది. ఎమిలీ.. ప్రభుత్వ శిబిరంలోనే ఉందని అధికారులు తెలిపారు.
వెంటనే గ్లెండా కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు తర్వాత 25 రోజులకు టెక్సాస్ ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన కూతుర్ని కలుసుకుంది గ్లెండా. మనసారా తన కూతుర్ని గుండెలకు హత్తుకుంది.
కుటుంబ కలహాలు