అమెరికా అధ్యక్ష పోరు విజేత జో బైడెన్‌కు జార్జీయా సెనేట్ ఎన్నికలు ఎంతో కీలకం. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సునామీ అనంతరం అగ్రరాజ్య రాజకీయాలు ఎలా ఉండనున్నాయనేదీ ఈ ఎన్నికలతో తేలిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
అధ్యక్ష పోరు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలపై ట్రంప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. బైడెన్ గెలుపుపై విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్. ఇది జార్జియాలోని రిపబ్లికన్ మద్దతుదారులపైనా ప్రభావం చూపించింది. అయితే మూడొంతుల రిపబ్లికన్ పార్టీ ఓటర్లు.. అధ్యక్ష ఎన్నికల్లో నిజంగానే అవకతవకలు జరిగాయని విశ్వసిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.
ఇదీ చూడండి:-ట్రంప్ ఫ్యాన్స్ దెబ్బకు మోత మోగిపోయింది!