అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో చేపట్టిన ఆడిట్ (చేతితో ఓట్ల లెక్కింపు)లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై 12,284 ఓట్ల మెజారిటీ సాధించారు. రీకౌంటింగ్‌కు ముందు 14,000 ఓట్లు మోజారిటీ ఉండగా.. ప్రస్తుతం మెజారిటీ స్వల్పంగా తగ్గింది.
1992 తర్వాత జార్జియాలో డెమొక్రట్ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ పార్టీకి పట్టున్న ఈ రాష్ట్రంలో బైడెన్ విజయం సాధించడం గమనార్హం.