అమెరికా వాషింగ్టన్లోని భారత రాయభార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహంపై రంగులు చల్లి అగౌరవ పరిచారు. ఈవిషయంపై భారత అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే వాషింగ్టన్లోని గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వారం రోజులుగా జరుగుతున్న నిరసనల్లో పలు చారిత్రక, పవిత్ర ప్రదేశాలను కూడా ధ్వసం చేశారు ఆందోళనకారులు. లింకన్ స్మారకం, ప్రసిద్ధ చర్చిలో విధ్వంసం సృష్టించారు.