తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా పంపిణీపై జీ7 దేశాల హామీ

పేద దేశాలకు ఆర్థిక సాయం, కొవిడ్ వ్యాక్సిన్ డోసులను అందిస్తామని జీ7 దేశాలు ప్రకటించాయి. అయితే వ్యాక్సిన్​ డోసులు ఎంత మొత్తంలో పంపిణీ చేస్తారు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇందుకోసం రూ.54.41 వేల కోట్లను విరాళంగా ఇస్తామని వెల్లడించాయి.

g7 countries, vaccine
టీకా పంపిణీపై జీ7 దేశాల హామీ

By

Published : Feb 20, 2021, 11:35 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోన్న కొవాక్స్​ కార్యక్రమంపై జీ7 దేశాలు (అమెరికా, యూకే, ఫ్రాన్స్​, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ) సానుకూలంగా స్పందించాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనాపై పోరుకు సాయం అందిస్తామని ప్రకటించాయి. శుక్రవారం జరిగిన వర్చువల్​ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాయి. మొత్తం రూ.54.41 వేల కోట్లను విరాళంగా ఇస్తామని తెలిపాయి. అయితే వ్యాక్సిన్​ డోసుల పంపిణీ విషయంలో ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.

"ఈ మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయంలో దేశాలు తమ ఆధిపత్యం ప్రదర్శించడం సరికాదు. కాబట్టి అవసరం ఉన్న ప్రతి దేశానికీ టీకా అందించేలా కృషి చేద్దాం. మా వద్ద మిగిలిన డోసులలో ఎక్కువ భాగం ఇతర దేశాలకు అందిస్తామని హామీ ఇస్తున్నాను."

-బోరిస్ జాన్సన్​, యూకే​ ప్రధాని

ఎన్ని డోసుల టీకాలను పంపిణీ చేయగలమనే విషయాన్ని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని యూకే విదేశాంగ మంత్రి జేమ్స్​ పేర్కొన్నారు.

"సభ్యదేశాలు అన్నీ ప్రస్తుతం తమ వద్ద ఉన్న కొవిడ్​ డోసులలో 5 శాతం పేద దేశాలకు తక్షణం అందించాలి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఈ పని చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ చర్యలు చేపడితేనే ఆఫ్రికా దేశాల్లో పాశ్చాత్య దేశాల ప్రభావం కనిపిస్తుంది. లేదంటే వారు చైనా, రష్యా టీకాలకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ ప్రాంతాల్లో పాశ్చత్యా దేశాల ప్రభావం ఉండటం అనేది కలగానే మిగిలి పోతుంది."

-ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్​ అధ్యక్షుడు

"ఇది సమానత్వం అమలుపై ఎదురైన ప్రాథమిక సవాల్. జర్మనీలో వ్యాక్సినేషన్​కు ఎటువంటి ఆటంకం ఉండదు. ఇతర దేశాలకు ఎంత మొత్తంలో టీకా డోసులు పంపిణీ చేయాలనే విషయంపై మేమింకా చర్చించలేదు."

-ఏంజెలా మెర్కెల్​​, జర్మనీ ఛాన్సలర్​

మేము నమ్మలేం..

"130 దేశాల్లో అసలు వ్యాక్సిన్లే లేవు అలాంటిది పరిమిత దేశాల్లో అవసరానికి మించి టీకాలు ఉన్నాయని నమ్మడం మూర్ఖత్వం"

-గేల్​ స్మిత్, వన్​ సేవా సంస్థ

ఆఫ్రికాలో ఇప్పటికే..

కొవాక్స్​ నుంచి టీకాల కోసం ఆఫ్రికా దేశాలు ఎదురుచూస్తున్నా.. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాయి. రష్యా సహా పలు జీ7 ఇతర దేశాలను సంప్రదించి టీకాలను అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాయి. మే నెలలో 30 కోట్ల స్పుత్నిక్​ టీకాలు వస్తాయని స్థానిక యూనియన్​ వెల్లడించింది. ఇదివరకు ఇదే విధంగా వివిధ సంస్థలకు చెందిన 27 కోట్ల టీకాలను అందుబాటులోకి తెచ్చుకుంది.

ఇదీ చదవండి :ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: అమెరికా

ABOUT THE AUTHOR

...view details