తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పోలీసు వీరుడు సందీప్​కు ఘన నివాళి - Friends and colleagues have paid tribute

అమెరికాలో ఓ ఉన్మాది కాల్పులకు బలైన సిక్కు పోలీసు అధికారికి సహోద్యోగులు, హ్యూస్టన్​ వాసులు ఘన నివాళి అర్పించారు. సందీప్​ ధాలివాల్​ నిజాయితీపరుడని కొనియాడారు.

అమెరికా పోలీసు వీరుడు సందీప్​కు ఘన నివాళి

By

Published : Sep 29, 2019, 11:55 AM IST

Updated : Oct 2, 2019, 10:43 AM IST

అమెరికా పోలీసు వీరుడు సందీప్​కు ఘన నివాళి

అమెరికా టెక్సాస్​లో హత్యకు గురైన సిక్కు పోలీసు అధికారి సందీప్ ధాలివాల్​కు సహోద్యోగులు, సన్నిహితులు, హ్యూస్టన్​ వాసులు ఘన నివాళులు అర్పించారు. భారత సంతతికి చెందిన సందీప్​​ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించేవారని కొనియాడారు.

సందీప్​ మృతదేహానికి అక్టోబర్​ 2న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హ్యూస్టన్​లో హారీస్​ కౌంటీ డిప్యూటీ షెరీఫ్​గా పదేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు 42 ఏళ్ల సందీప్​ ధాలివాల్​. శనివారం ఓ ఉన్మాది కాల్పుల్లో మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన రాబర్టోలిస్​ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:పడవలోని ఆ 34 మంది అగ్నికి ఆహుతయ్యారు

Last Updated : Oct 2, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details