తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రెండ్లీ ఫేస్​బుక్​

ఫేస్​బుక్  గోప్యత కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్​ జుకెర్​బర్గ్ తెలిపారు. అందుకోసం మెసేంజర్​, వాట్సాప్​, ఇన్​స్టా యాప్​ల్లో నూతన ఎన్​క్రిప్షన్​ సాంకేతికతను వాడనున్నారు.

By

Published : Mar 7, 2019, 8:20 PM IST

Updated : Mar 8, 2019, 2:45 PM IST

ఫ్రెండ్లీ ఫేస్​బుక్​

వ్యక్తిగత సమాచారానికిమరింత భద్రత కల్పించేందుకు ఫేస్​బుక్​ సిద్ధమైంది. ఇటీవల కేంబ్రిడ్జ్​ అనలిటికా సంస్థతో కలిసి సమాచార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.

వ్యక్తిగత గోప్యత కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్​ జుకెర్​బర్గ్ తెలిపారు. నూతన భద్రతా విధానాలతో నెటిజన్ల సమాచారానికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

డేటా దుర్వినియోగం అభియోగం
  • వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటన​ల కోసం సంస్థలకు అందజేసినట్లు ఫేస్​బుక్​పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్నుంచి ఈ సామాజిక మాధ్యమంపై వినియోగదారుల్లో అపనమ్మకం పెరుగుతూ వచ్చింది. నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించామని జుకెర్​బర్గ్​ వెల్లడించాడు. సమాచారం, చిత్రాలకు సరికొత్త ఎన్​క్రిప్షన్​ టెక్నిక్​తో భద్రత కల్పించనున్నారు. ఫలితంగా మూడో వ్యక్తితో సహా ఫేస్​బుక్​ సైతం యూజర్​ డేటాను చూడలేదు. న్యూస్​ఫీడ్, గ్రూప్​ సర్వీసుల్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులతోనైనా ఇన్​స్టా, ఫేస్​బుక్​ వినియోగదారులను కాపాడుకోవచ్చని అనుకుంటోంది సంస్థ.
    నూతన ఎన్​క్రిప్షన్​ టెక్నిక్

మెసేంజర్​, వాట్సాప్​, ఇన్​స్టా యాప్​ల్లో నూతన ఎన్​క్రిప్షన్​ సాంకేతికతను వాడనున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్​ వాట్సాప్​లో ఉంది. సమాచారాన్ని పంపినవారు, తీసుకున్నవారు మాత్రమే చూడగలరు.

మెసేంజర్​, వాట్సాప్​, ఇన్​స్టా యాప్​ల్లో ఒకే ప్రొఫైల్​

ఫొటోల పబ్లిక్​ షేరింగ్​ మాత్రం అలానే ఉండనుంది. మెసేంజర్​, వాట్సాప్​, ఇన్​స్టా యాప్​ల్లో ఒకే ప్రొఫైల్​ ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు వాట్సాప్​లోకి సైతం యాడ్​లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని ఎలా అడ్డుకుంటారనే దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు టెక్​ నిపుణులు.

మార్పులు లేని పబ్లిక్ షేరింగ్​
  • 87 మిలియన్ యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందని.. ఈ సమాచారం ఆధారంగానే 2016లో ట్రంప్​ ప్రచారం నిర్వహించినట్లు ఫేస్​బుక్​పై ఆరోపణలు వచ్చాయి. రష్యాకి చెందిన కొందరు అమెరికా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని విమర్శలూ ఎదుర్కొన్నారు. దీనిపై రెండు రోజుల విచారణ ఎదుర్కొని.. క్షమాపణలు సైతం చెప్పాడు జుకెర్​బర్గ్.
    విచారణ ఎదుర్కొన్న మార్క్​ జుకెర్​బర్గ్
Last Updated : Mar 8, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details