తెలంగాణ

telangana

ETV Bharat / international

Covid Vaccine: శీతలీకరణ అక్కర్లేని సరికొత్త కొవిడ్​ టీకాలు

ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగే కొవిడ్​ వ్యాక్సిన్​ను (Covid Vaccine) రూపొందించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. కొన్ని రకాల మొక్కలు, బ్యాక్టీరియాల నుంచి సేకరించిన కీలక పదార్థాలతో వీటిని రూపొందించారు.

fridge free covid vaccine
శీతలీకరణ అక్కర్లేని సరికొత్త కొవిడ్​ టీకాలు

By

Published : Sep 9, 2021, 5:31 AM IST

Updated : Sep 9, 2021, 6:36 AM IST

కొవిడ్‌ వ్యాక్సిన్ల(Covid Vaccine) రంగంలో మైలురాయిగా నిలిచే పరిశోధన ఇది! శీతలీకరణ అక్కర్లేని సరికొత్త కొవిడ్‌ టీకాలను (Covid Vaccine India) కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొన్ని రకాల మొక్కలు, బ్యాక్టీరియాల నుంచి సేకరించిన కీలక పదార్థాలతో వీటిని రూపొందించారు. ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకోగలవు. తక్కువ ఖర్చుకే వీటిని తయారు చేయవచ్చని.. ఆందోళనకర వేరియంట్లను నియంత్రించే శక్తిమంతమైన యాంటీబాడీలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయగలవని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాలన్నింటినీ(Vaccine in India) తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ రవాణా చేయాల్సి వస్తోంది. వసతులు అంతగా ఉండని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వీటిని చేరవేయడం పెద్ద సవాలుగా మారింది.

ఈ సమస్యపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు దృష్టి సారించారు. కౌపియా మొక్కలన్ను ఇ-కోలి బ్యాక్టీరియాను ఉపయోగించి.. కోట్ల సంఖ్యలో ప్లాంట్‌ వైరస్‌ను, బంతి ఆకారంలోని అతిసూక్ష్మ బ్యాక్టీరియా ఫేజ్‌లను అభివృద్ధి చేశారు. తర్వాత వాటికి కరోనా వైరస్‌లో(Coronavirus) ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ను జతచేశారు. శరీరంలోకి ఇవి ప్రవేశించగానే, రోగనిరోధక వ్యవస్థ స్పందించి కొవిడ్‌ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు వివరించారు. ఇప్పటికే ఎలుకలపై చేపట్టిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తదుపరి దశలో మనుషులపై ప్రయోగాలు నిర్వహించి, వాటి భద్రత, పనితీరును అంచనా వేయనున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రంగంలో సరికొత్త మార్కులకు తమ పరిశోధన మైలు రాయిగా నిలుస్తుందని పరిశోధనకర్త నికోల్‌ స్టీన్‌మెజ్‌ వివరించారు.

ఇదీ చూడండి :సామాన్యుడి ప్రాణాలు కాపాడి మంత్రి మృతి

Last Updated : Sep 9, 2021, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details