అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) ఉన్న నలుగురు వ్యోమగాములు తిరిగి భూమికి (Astronauts returning from Space) చేరుకున్నారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్‌లో బయల్దేరిన వీరు.. ఫ్లోరిడా తీరంలో సముద్రంలో విజయవంతంగా దిగారు. వెంటనే రికవరీ బోట్లు ఆ ప్రాంతానికి చేరుకొని.. వ్యోమగాములను బయటకు తీశాయి.
అమెరికా వ్యోమగాములు షేన్ కింబ్రో, మేఘన్ మెకార్థర్, జపాన్‌కు చెందిన అకిహిడో హొషిదే, ఫ్రాన్స్‌కు చెందిన థామస్ పెస్క్వెట్.. తిరిగి భూమికి (Astronauts return to Earth 2021) వచ్చారు. 200 రోజుల పాటు వీరంతా అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేశారు. ఎనిమిది గంటల్లోనే వీరి ప్రయాణం (Astronauts returning from Space) పూర్తి కావడం విశేషం.
టాయిలెట్ పనిచేయని (Space toilet problem) స్పేస్ క్యాప్సూల్‌లో వ్యోమగాములు ప్రయాణించారు. ఎనిమిది గంటల ప్రయాణంలో వీరికి టాయిలెట్ ఉపయోగించే అవకాశం లేదు. ప్రతిఒక్కరూ డైపర్లనే వినియోగించారు.