తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా కాల్పుల మృతుల్లో నలుగురు భారతీయులు - Four Sikhs killed in latest US mass shooting

అమెరికాలోని ఇండియానాపొలిస్​లో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో నలుగురు భారతీయులు సహా 8 మంది మృతిచెందారు. వారికి అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంతాపం ప్రకటించారు.

US mass shooting, sikhs killed in US shooting
అమెరికా కాల్పుల్లో నలుగురు సిక్కులు మృతి, సిక్కులు

By

Published : Apr 17, 2021, 8:55 AM IST

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో కనీసం 8 మంది చనిపోగా, వారిలో నలుగురు భారతీయ సిక్కులు ఉన్నారని స్థానిక నేతలు తెలిపారు. ఇండియానాపొలిస్​లోని ఫెడెక్స్​ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ భీకర కాల్పుల్లో మరో ఐదుగురు గాయపడ్డారు.

కాల్పులకు తెగబడిన సాయుధుడిని ఇండియానాకు చెందిన 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్​ హోల్​గా అధికారులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం అతడు తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఫెడెక్స్​లో పనిచేసేవారిలో 90 శాతం మంది భారతీయ అమెరికన్లేనని, వారిలో ఎక్కువ శాతం మంది సిక్కు వర్గం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది.

బైడెన్ సంతాపం..

కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సంతాపం తెలిపారు.

యూఎస్ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని యొషిహిదే సుగా కూడా.. ద్వైపాక్షిక భేటీకి ముందు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

విదేశాంగ మంత్రి..

ఇండియానాపొలిస్ ఘటన పట్ల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్థానిక అధికారులు, సిక్కు నేతలతో చికాగాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్​ సంప్రదింపులు జరపుతున్నారని తెలిపారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:అమెరికాలో విషం చిమ్ముతున్న 'గన్​ కల్చర్​'

ABOUT THE AUTHOR

...view details