Barack Obama Tests Covid Positive: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు.
"గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మిచెల్, నేను వ్యాక్సిన్ తీసుకున్నాం. పరీక్షల్లో మిచెల్‌కు నెగెటివ్‌గా తేలింది. కేసులు తగ్గినప్పటికీ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకొని వారుంటే వెంటనే తీసుకోండి" అని ఒబామా ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్..
ఒబామాకు కొవిడ్ సోకడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒబామా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. ప్రస్తుతం అన్నిదేశాల్లో కరోనా కనుమరుగు అవుతున్న వేళ చైనాలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
అమెరికాలో గత జనవరిలో రోజువారీగా నమోదైన కేసుల సరాసరి 8 లక్షలు ఉండగా, ప్రస్తుతానికి 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి.
ఇదీ చూడండి:ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. నో ఫ్లైజోన్ ప్రకటనకు జెలెన్స్కీ వినతి