తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ కొత్త రోల్- బాక్సింగ్ మ్యాచ్​లో నేరుగా... - ట్రంప్ బాక్సింగ్

బాక్సింగ్​లో డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిభ చూపించనున్నారు. బాక్సింగ్​లో 'పంచ్'​లు విసరనున్నారు. అయితే, రింగ్​లోకి దిగి ప్రత్యర్థులపై పిడిగుద్దులు కురిపించరు. నోటితో 'పంచ్'​లు విసరనున్నారు. మ్యాచ్​కు కామెంట్రీ చెప్పి.. శ్రోతలను ఉర్రూతలూగించనున్నారు.

trump boxing
ట్రంప్ బాక్సింగ్

By

Published : Sep 9, 2021, 9:47 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఓ బాక్సింగ్ మ్యాచ్​కు కామెంట్రీ చెప్పనున్నారు. మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ ఎవాండర్ హోలీఫీల్డ్(58) (Evander Holyfield) పాల్గొనే ఎగ్జిబిషన్ బాక్సింగ్​ మ్యాచ్​కు డొనాల్డ్ ట్రంప్ (Trump news) కామెంటేటర్​గా వ్యవహరించనున్నారు. శనివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది.

"గొప్ప ఫైటర్లన్నా, గొప్ప పోరాటాలన్నా నాకు చాలా ఇష్టం. శనివారం రాత్రి ఈ రెండింటినీ చూడబోతున్నాం. నా అభిప్రాయాలను పంచుకుంటా. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు మిస్ అవ్వాలని కోరుకోరు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

బాక్సింగ్​తో ట్రంప్​కు విడదీయరాని అనుబంధం ఉంది. గత కొన్నేళ్లుగా న్యూజెర్సీలోని (trump new jersey) తన క్యాసినోలలో అనేక బాక్సింగ్ ఫైట్​లకు ఆతిథ్యం ఇచ్చారు. చాలా మ్యాచ్​లకు ప్రచారం చేశారు.

మ్యాచ్​లో పాల్గొననున్న బాక్సర్ ఎవాండర్ హోలీఫీల్డ్

అయితే, ట్రంప్ పాల్గొననున్న కార్యక్రమం సెప్టెంబర్ 11న జరగనుంది. అమెరికాలో ట్విన్​ టవర్స్​పై దాడి చేసి ఈ రోజుకు 20 ఏళ్లు (9/11 attack anniversary) నిండుతాయి. బాక్సింగ్ మ్యాచ్ కాకుండా ఆరోజు మరే కార్యక్రమాల్లోనూ ట్రంప్ పాల్గొనరని సమాచారం.

ఇదీ చదవండి:ప్రధాని, ఉప ప్రధాని సహా 14 మంది నరహంతకులే!

ABOUT THE AUTHOR

...view details