తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఒసామా సమాచారం పాక్​కు తెలియదు' - సీఐఏ మాజీ డైరెక్టర్​ పెట్రియాస్

ఒసామా బిన్​ లాడెన్​ సమాచారాన్ని.. అమెరికాకు పాకిస్థాన్​ నిఘా విభాగం(ఐఎస్​ఐ) అందించిందని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు సీఐఏ మాజీ డైరెక్టర్​ పెట్రియాస్​. ఒసామా సమాచారం.. పాక్​ ఐఎస్​ఐకి తెలియదని చెప్పి.. ఇమ్రాన్​కు కౌంటర్​ ఇచ్చారు.

''ఒసామా సమాచారం పాక్​కు తెలియదు''

By

Published : Jul 24, 2019, 6:03 PM IST

అమెరికా నిఘా విభాగం(సీఐఏ) మాజీ డైరెక్టర్​ పెట్రియాస్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్​ఖైదా అధినేత ఒసామా బిన్​ లాడెన్​ సమాచారాన్ని.. సీఐఏకు పాకిస్థాన్​ నిఘా విభాగం(ఐఎస్​ఐ) అందించిందన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. ఒసామా ఎక్కడ తలదాచుకున్నాడో ఐఎస్​ఐకి తెలియదని పేర్కొన్నారు పెట్రియాస్​. ఇవి ఇమ్రాన్​ ప్రకటనలకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం.

ఐఎస్​ఐ సహకారంతోనే అమెరికా నిఘా విభాగం ప్రత్యేక ఆపరేషన్​లో లాడెన్​ను మట్టుబెట్టిందని ఫాక్స్​ న్యూస్​కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇమ్రాన్​. అమెరికా నేవీ సీల్స్ పాకిస్థాన్​​ అబోటాబాద్​లో తలదాచుకున్న.. ఒసామాను 2011లో కాల్చిచంపింది. అయితే.. అప్పటివరకు లాడెన్​ పాక్​లో ఉన్న విషయం తమకు తెలియదని చెబుతూ వచ్చింది దాయాది దేశం.

పాక్​పై నమ్మకముంది..!

అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండో-పసిఫిక్​ అంశంపై మాట్లాడారు పెట్రియాస్​. తీవ్రవాద నాయకుడు ఒసామా తమ దేశంలో దాక్కున్నట్లు పాక్​ నిఘా విభాగానికి​ తెలియదని అమెరికా నమ్ముతున్నట్లు తెలిపారు.

''పాకిస్థాన్​ నిఘా విభాగం(ఐఎస్​ఐ)కు గానీ, ఇతరులకు గానీ.. ఒసామా పాక్​లో ఉన్నట్లు తెలియదని మాకు నమ్మకముంది. వారెవరూ అతడిని దాచలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. మాకు లాడెన్​ అంశంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఒసామాను అబోటాబాద్​లోని ఓ ప్రదేశంలో ఉండేందుకు పాకిస్థానీయులు అనుమతించారన్న వారి వ్యాఖ్యల్ని పూర్తిగా విభేదిస్తున్నాం.''
- పెట్రియాస్​, సీఐఏ మాజీ డైరెక్టర్​

పాక్​ ప్రధానిపై చివర్లో సానుకూల వ్యాఖ్యలు చేశారు పెట్రియాస్​. ఇమ్రాన్​ఖాన్​.. తమ దేశంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. అధిగమించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పాక్​​లో 40వేల మంది ఉగ్రవాదులు: ఇమ్రాన్

ABOUT THE AUTHOR

...view details