Afghanistan Finance Minister Uber: ఖలీద్ పయెండా ఆరు నెలల క్రితం అఫ్ఘానిస్తాన్ ఆర్థికమంత్రి. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్వహించిన వ్యక్తి. ఆర్థికమంత్రిగా సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్న ఖలీద్ పరిస్థితి..తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడం వల్ల ఒక్కసారిగా మారిపోయింది.
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకునే వారం రోజుల ముందు తన పదవికి రాజీనామా చేసిన ఖలీద్.. అమెరికా వెళ్లిపోయాడు. ఇప్పుడు వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పర్యవేక్షించిన ఖలీద్.. ఇప్పుడు ఆరు గంటల పాటు శ్రమించి 150 డాలర్లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.