తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆహార పదార్థాలతో కరోనా వ్యాపించదు' - ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్

ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). చైనాలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చికెన్​, రోయ్యల ఉత్పత్తుల్లో మహమ్మారిని గుర్తించినట్లు తెలిపిన నేపథ్యంలో వివరణ ఇచ్చింది ​డబ్ల్యూహెచ్‌ఓ

Food Products Would not Transmit Corona
'ఆహార పదార్థాలతో కరోనా వ్యాపించదు'

By

Published : Aug 14, 2020, 10:01 PM IST

ఆహార ఉత్పత్తులు, వాటి ప్యాకేజింగ్ నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆహార సరఫరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు రోజుల క్రితం చైనాలోని జియాన్‌, షెన్‌జెన్‌ నగరాలకు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ వింగ్స్‌, ఈక్వెడార్ నుంచి వచ్చిన రొయ్యల ఉత్పత్తుల్లో కరోనా వైరస్‌ను గుర్తించినట్లు అక్కడి చైనా అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలకు సూచించారు.

తాజాగా చైనా ప్రకటనపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. "ప్రజలు ఆహార పదార్థాలు, వాటి ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, ఫుడ్ డెలివరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలు, ఫుడ్ చైన్‌ ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. వినియోగదారులు వాటిని ఎలాంటి ఆందోళన లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు" అని డబ్లూహెచ్‌వో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌ హెడ్ మైక్‌ ర్యాన్‌ తెలిపారు.

అలానే చైనా ఎన్నో వేల ప్యాకేజీలను పరిశీలించగా చాలా తక్కువ స్థాయిలో వైరస్‌ కారకాలను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో ఎపిడిమాలజిస్ట్ మరియ వాన్‌ కెర్‌ఖోవ్‌ పేర్కొన్నారు. చైనా ఆరోపణలపై బ్రెజిల్, ఈక్వెడార్ స్పందించాయి. తమ దేశం కరోనా నిబంధనలను కఠినంగా పాటిస్తుందని, ప్యాకేజీలు ఓ సారి దేశం దాటాక వాటితో తమకు సంబంధం లేదని ఈక్వెడార్ తెలిపింది. చైనా కనుగొన్న దానిపై పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు బ్రెజిల్‌ ప్రకటించింది.

ఇదీ చూడండి:అటారీ-వాఘా సరిహద్దులో 'బీటింగ్​ రిట్రీట్'​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details