ఆమె..27 ఏళ్ల తర్వాత పుట్టడమేంటీ? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఆశ్చర్యాన్ని వాస్తవం చేసింది ఆధునిక వైద్యశాస్త్రం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్ ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది. టీనా గిబ్సన్ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు. అప్పటి నుంచి క్రయోజనిక్ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అలా ఉంచిన పిండాన్ని ఈ ఏడాది ఆరంభంలో గిబ్సన్ గర్భాశయంలోకి పంపారు. ఆమె అక్టోబర్ 26న మాలీ ఎవ్రెట్ గిబ్సన్‌కు జన్మనిచ్చింది.
ఆమె.. 27 ఏళ్ల తర్వాత పుట్టింది - శిశువు
27 ఏళ్ల పాటు దాచి ఉంచిన పిండం సాయంతో అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రానికి చెందిన టీనా గిబ్సన్ అనే మహిళ.. ఓ అందమైన శిశువుకు జన్మనిచ్చింది. టీనా గిబ్సన్ గర్భాశయంలోకి పంపిన పిండాన్ని 1992లో సేకరించారు.
ఆమె..27 ఏళ్ల తర్వాత పుట్టింది
ఇలా శీతలీకంరించిన పిండం ద్వారా శిశువుకు జన్మనివ్వటం గిబ్సన్‌కు కొత్త కాదు. ఆమె మొదటి కుమార్తె ఎమ్మా రెన్ గిబ్సన్ కూడా 24ఏళ్ల పాటు భద్రపరిచిన పిండం నుంచి జన్మించిందే. అప్పటికి అది రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును మాలీ ఎవ్రెట్ గిబ్సన్ అధిగమించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే..ఈ రెండు పిండాలు 1992లో ఒకే వ్యక్తి నుంచి సేకరించినవే.
ఇదీ చదవండి :చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్