Fetus inside liver: మహిళల జీవితంలో గర్భధారణ సమయం అత్యంత క్లిష్టమైన దశ. శిశువును 9 నెలలపాటు కడుపులో మోయడం అంటే మాటలు కాదు. ఒక్కోసారి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కెనడాలో మాత్రం ఓ మహిళ వినూత్న రీతిలో గర్భం దాల్చింది. ఆమెకు గర్భాశయంలో కాకుండా పిండం లివర్లో అభివృద్ధి చెందింది.
రుతు రక్తశ్రావం అధికంగా అవుతుందని డాక్టర్ను సంప్రదించినప్పుడు ఆమెకు ఈ విషయం తెలిసింది. పరీక్షలు చేసిన వైద్యులు కూడా రిపోర్టు చూసి షాక్ అయ్యారు. అయితే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతుంటాయని చెప్పారు. ఫలదీకరణం చెందిన అండాలు గర్భాశయంలో కాకుండా పొరపాటున శరీరంలోని వేరేభాగంలో స్థిరపడటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని వివరించారు. సాధారణంగా ఇలా జరిగే అవకాశమే లేదన్నారు.
Ectopic pregnancy