కొవిడ్ బాధితుల్లో పక్షవాతం, రక్తం గడ్డ కట్టడం వంటి తీవ్ర ప్రతికూలతలు తలెత్తే అవకాశాలను తగ్గించే సామర్థ్యం ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) టీకాకు(Flu Vaccine) ఉందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నవారు ఐసీయూల్లో చేరే ముప్పు కూడా తక్కువేనని నిర్ధరించింది.
Flu Vaccine: కొవిడ్ ప్రతికూలతలకు ఫ్లూ టీకాతో చెక్!
కొవిడ్ ప్రతికూలతలను తగ్గించే సామర్థ్యం ఇన్‌ఫ్లుయెంజా(ఫ్లూ) టీకాకు(Flu Vaccine) ఉందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ టీకా తీసుకున్నవారు ఐసీయుల్లో చేరే ముప్పు తక్కువేనని నిర్ధరించింది.
కొవిడ్ ప్రతికూలతలకు ఫ్లూ టీకాతో చెక్
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, సింగపూర్ సహా పలు దేశాలకు చెందిన 37,377 మందిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామి మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఏటా ఫ్లూ టీకా తీసుకునేవారితో పోలిస్తే.. దాన్ని వేయించుకోనివారు కొవిడ్ కారణంగా ఐసీయూల్లో చేరే ముప్పు 20% వరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో పక్షవాతం ముప్పు 58%, సెప్సిస్ ముప్పు 45% వరకు ఎక్కువగా ఉంటోందని నిర్ధరించారు.