హ్యూస్టన్‌కు చేరుకున్న ఫ్లాయిడ్ పార్థివదేహం అమెరికాలో పోలీసు చేతిలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ మృతదేహం టెక్సాస్‌కు చేరుకుంది. ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా వచ్చినట్లు హ్యూస్టన్ పోలీస్ విభాగం సారథి ఆర్ట్ అసేవెడో ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఫ్లాయిడ్‌ను ప్రజలు చివరి చూపు చూసుకొని, నివాళులు అర్పించే విధంగా సోమవారం ఆరు గంటలపాటు హ్యూస్టన్‌లో పార్థివదేహాన్ని ఉంచే ఏర్పాటు చేశారు అధికారులు. అనంతరం మంగళవారం పియర్లాండ్ శివార్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
హ్యూస్టన్‌కు చేరుకున్న ఫ్లాయిడ్ పార్థివ దేహం వెనుదిరుగుతున్న సైనిక బలగాలు..
నేషనల్ గార్డ్ దళాలను అమెరికా రాజధాని వాషింగ్టన్ నుంచి వైదొలగాలని ఆదేశించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని వెల్లడించారు. ఫ్లాయిడ్ మృతితో చెలరేగిన నిరసనలను అరికట్టేందుకు గతవారం కొంతమంది సైనిక బలగాలను పంపించాలని కొలంబియా ప్రభుత్వం ట్రంప్‌ను కోరింది. ఈ క్రమంలోనే నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని వేలాది మంది నేషనల్ గార్డ్ దళాలను ఆదేశించారు ట్రంప్.
హ్యూస్టన్‌కు చేరుకున్న ఫ్లాయిడ్ పార్థివ దేహం అయితే, ఈ దళాలను ఉపసంహరించుకోవాలని డి.సి. మేయర్ మురియెల్ బైసర్ ట్రంప్‌ను డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ట్రంప్.. వారంతా తిరిగి వెళ్తున్నారని, అవసరమైతే మళ్లీ వస్తారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇదీ చూడండి:కిక్కిరిసిన అమెరికా రోడ్లు- శాంతియుతంగా నిరసనలు