నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ నిరసనకారులు నినదించారు. న్యూయార్క్‌లో వేలాది మంది.. ఆరోగ్య సిబ్బంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారుల కంటే జాతివివక్ష ప్రమాదకరమైందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి ఓ దుండగుడు దాడికి యత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా, దుండగుడి పరిస్థితి విషమంగా ఉంది. న్యూయార్క్‌లో వేలాది మంది పోలీసులను వీధుల్లో మెహరించారు. మార్పుకు, ఆశకు ప్రతినిధులం తామే అని, శాంతియుతంగా ఆందోళనలు కొనసాగించాలని, అనేక నగరాల్లో పోలీసులు మోకాళ్లపై నిల్చుని అభ్యర్థిస్తున్నారు.
పోలీసుల సస్పెన్షన్
న్యూయార్క్‌లో పోలీసుల తీరు మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లాయిడ్ ఆందోళనల్లో పాల్గొన్న 75 ఏళ్ల ఓ వృద్ధుడిని ఇద్దరు పోలీసులు నెట్టేశారు. దీనితో ఆయన తలకు తీవ్రగాయమై రక్తం కారింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ వీడియో చూసి చాలా బాధపడ్డానని బఫెలో మేయర్ బైరాన్ బ్రౌన్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతియుత నిరసనలు చేస్తోన్న వారిపై... పోలీసులు ప్రవర్తించిన తీరు నిరాశపరిచిందని మేయర్ తెలిపారు.
ప్రముఖుల సంతాపం