తెలంగాణ

telangana

ETV Bharat / international

పోయిన ఉంగరం మూడేళ్లకు లభ్యం- కరోనా వల్లే! - అమెరికా

మూడేళ్ల క్రితం పోయిన ఉంగరం ఇప్పుడు దొరికే అవకాశముందా? అది కూడా ఇంట్లో కాదు ఓ రెస్టారెంట్​లో? మామూలుగా అయితే అసాధ్యం. కానీ అమెరికాలో మాత్రం సాధ్యమైంది. కరోనా లాక్​డౌన్​ ఇందుకు పరోక్షంగా కారణమైంది.

Florida restaurant finds NY man's wedding ring 3 years later
మూడేళ్ల తర్వాత అదే రెస్టారెంట్​లో లభ్యం!

By

Published : Apr 20, 2020, 3:21 PM IST

అమెరికాలో ఓ కొత్త జంట సరదాగా రెస్టారెంట్​కు వెళ్లింది. అనుకోకుండా యువకుడు తన చేతికున్న ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. ఇది జరిగి మూడేళ్లు అయింది. అనూహ్యంగా ఇప్పుడు ఆ ఉంగరాన్ని దక్కించుకున్నాడు ఆ వ్యక్తి

ఏం జరిగిందంటే!

ఫ్లోరిడాలోని ఫోర్ట్​ లాడర్డేల్​ రెస్టారెంట్​కు మూడేళ్ల క్రితం నవజంట మైక్​, లిసా విందుకు వెళ్లారు. అనుకోకుండా ఆ యువకుడు తన చేతికున్న పెళ్లి ఉంగరాన్ని చేజార్చుకున్నాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

కరోనా వల్ల

ఫోర్ట్​ లాడర్డేల్​ రెస్టారెంట్​ను అందంగా తీర్చిదిద్దేంచుకు చెక్కను ఉపయోగించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆ చెక్కను మార్చాలని రెస్టారెంట్​ మేనేజర్ ర్యాన్​ క్రివోయ్​​ నిర్ణయించారు. అందుకు సంబంధించి పనులు చేపట్టారు. ఆ సమయంలో ఓ బంగారు నాణెం, 100 డాలర్ల నోట్లతో పాటు ఓ వెండి ఉంగరాన్ని గుర్తించారు. ఆ ఉంగరం గురించి రెస్టారెంట్ మార్కెటింగ్​ మేనేజర్​ సాషా ఫార్మికా ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును 5 వేల మందికిపైగా షేర్ చేశారు. చివరకు ఆ పోస్టు మైక్, లిసా వరకు చేరింది. ఆ ఉంగరం తమదేనని గుర్తించారు.

ఫొటో చూపించి సొంతం చేసుకున్నారు

ఆ ఉంగరం తమదేనని సాషాకు చెప్పారు మైక్​, లిసా. మూడేళ్ల క్రితం రెస్టారెంట్​లో దిగిన ఫొటో చూపించారు. చివరకు 3 రోజుల తర్వాత వారికి ఆ ఉంగరాన్ని అందించింది ఆ రెస్టారెంట్.

ఇదీ చదవండి:'వార్తా సంస్థలకు గూగుల్, ఫేస్​బుక్​ డబ్బు చెల్లించాల్సిందే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details