తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కరోనా కల్లోలం- ఫ్లోరిడాలో రికార్డు కేసులు - us news

అగ్రరాజ్యంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, వైరస్ కట్టడి చర్యలకు ఆ రాష్ట్ర గవర్నర్ గండి కొడుతున్నారు. స్థానిక సంస్థలు ఆంక్షలు విధించకుండా వారి అధికారాలకు కోత పెడుతున్నారు.

us covid cases
అమెరికా కరోనా కేసులు

By

Published : Aug 1, 2021, 10:46 AM IST

అమెరికాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే 21,683 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. జనవరి 7న నమోదైన 19,334 కేసులే ఇప్పటివరకు అత్యధికంగా ఉన్నాయి. టీకా సరిగా అందుబాటులో లేని సమయంలో ఆ స్థాయిలో కేసులు రాగా.. ఇప్పుడు మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల్లో ఐదో వంతు ఫ్లోరిడాలోనే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ రాష్ట్రం అమెరికాలో కరోనాకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వారంలో ఫ్లోరిడాలో 409 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం వైరస్ మృతుల సంఖ్య 39 వేలు దాటింది.

గవర్నర్ తీరు మరోలా..

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో మాస్కు ధరించడం, టీకా తీసుకోవడం తప్పనిసరి అన్న నిబంధనలు విధించడంపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసెంటిస్ వెనకడుగు వేస్తున్నారు. కరోనా నియంత్రణకు ఆంక్షలు విధించే జిల్లా యంత్రాంగాల అధికారాలకు కోత విధించారు. వచ్చే నెల నుంచి పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో.. విద్యార్థులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. సీజన్ మార్పుల వల్లే కేసులు పెరుగుతున్నాయని డిసాంటిస్ చెబుతున్నారు. వేడి వాతావరణం వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారని, ఏసీల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని చెప్పుకొచ్చారు.

అమెరికాలో 52 వేలు!

మరోవైపు, అమెరికావ్యాప్తంగా శనివారం 51,898 కేసులు నమోదయ్యాయి. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 629,315కు చేరగా.. మొత్తం కేసులు 3,57,45,024కు పెరిగాయి.

వివిధ దేశాల్లో కరోనా విజృంభణ ఇలా

దేశం కొత్త కేసులు మొత్తం కేసులు
బ్రెజిల్ 37,582 1,99,17,855
ఇండోనేసియా 37,284 34,09,658
బ్రిటన్ 26,144 58,56,528
రష్యా 23,807 62,65,873
ఫ్రాన్స్ 23,471 6,127,019

ABOUT THE AUTHOR

...view details