అమెరికాలోని డెట్రాయిట్ నగరం పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాల ధాటికి రోడ్లపై నీరు వరదలుగా ప్రవహిస్తోంది. వందలాది మంది నీటిలో చిక్కుకున్నారు. అధికారులు పడవల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాకపోకలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి.
డెట్రాయిట్ జలమయం- జనజీవనం అస్తవ్యస్తం - అమెరికా
అమెరికాలోని డెట్రాయిట్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఇళ్లు, రహదారులు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డెట్రాయిట్ను ముంచెత్తిన వరదలు