తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పులు.. దుండగుడు సహా నలుగురు మృతి - Five people died in a shooting at a Missouri gas station after the gunman went inside and opened fire

అమెరికాలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మిస్సోరీలోని ఓ గ్యాస్​ స్టోర్​లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Missouri gas station
అమెరికాలో కాల్పులు

By

Published : Mar 16, 2020, 11:40 PM IST

Updated : Mar 17, 2020, 6:49 AM IST

అమెరికాలో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సోరీలోని ఓ గ్యాస్​ స్టేషన్​లో చొరబడిన సాయుధుడు భీకర కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో దుండగుడితో పాటు ఓ పోలీసు అధికారి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అలాగే ఒక పోలీసు అధికారితో పాటు మరో వ్యక్తి ఈ దాడిలో గాయపడినట్లు స్ప్రింగ్​ ఫీల్డ్ పోలీస్ అధికారి పాల్​ విలియమ్స్​ పేర్కొన్నారు. కాల్పులపై సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలిపారు.

కాల్పుల ప్రాంతానికి ముందుగా చేరుకున్న ఇద్దరు పోలీసులపైనా దుండగుడు కాల్పులు జరిపినట్లు విలియమ్స్​ వెల్లడించారు. అనంతరం స్టోర్​ లోపలికి వెళ్లిన పోలీసులు.. దుండగుడితో పాటు మిగతా మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు.

అయితే తనను తాను కాల్చుకోవడం వల్లే సాయుధుడు మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ పోలీసుల పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Mar 17, 2020, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details