తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కూలిన విమానం- ఐదుగురు మృతి - అమెరికాలో కూలిన విమానం... ఐదుగురు మృతి

అమెరికా జార్జియాలో ఓ చిన్న విమానం కూలి ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఇండియానాలో ఒకరి అంత్యక్రియలకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం.

Five killed as plane crashes in Georgia
అమెరికాలో కూలిన విమానం... ఐదుగురు మృతి

By

Published : Jun 6, 2020, 10:43 AM IST

అమెరికా జార్జియాలో ఓ చిన్న విమానం కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇండియానాలో జరిగే ఒకరి అంతిమసంస్కారాల్లో పాల్గొనేందుకు వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటన ఆగ్నేయా అట్లాంటాకు 161 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. విమానంలో మంటలు చెలరేగిన కారణంగా చక్కర్లు కొడుతూ విమానం కుప్పకూలినట్లు ఓ స్థానికుడు తెలిపాడు. కూలే సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు వెల్లడించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర విభాగ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు.

పైపర్ పీఏ 31- టీ విమానం.. ప్లోరిడాలోని విల్లిస్టన్ నుంచి ఇండియానాలోని న్యూక్యాజిల్ ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఫెడరల్​ ఏవియేషన్​ అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'కొవిడ్ చికిత్సలో హెచ్​సీక్యూ ప్రభావం చూపించట్లేదు'

ABOUT THE AUTHOR

...view details