మానవులకు, కొన్ని రకాల జంతు జాతులకు దంతాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, చేపలకు కూడా దంతాలు ఉంటాయనే విషయం తెలిశాక అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. మనిషికి ఎలాగైతే దంతాలు ఉంటాయో అచ్చం అలాగే ఓ చేపకు దంతాలు ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
మనిషి దంతాలు, గొర్రె తలతో వింత చేప ఎక్కడంటే..?
అమెరికాలోని నార్త్ కారోలినాలో చేపలు పట్టే వ్యక్తికి దంతాలు ఉన్న చేప ఒకటి చిక్కింది. ఆ చేపకు మనిషిని పోలిన దంతాలు ఉన్నాయి. ఆ ఫొటోను జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. కొద్ది క్షణాల్లోనే దాన్ని 300కు పైగా మంది షేర్ చేశారు. చాలా మంది కామెంట్ కూడా చేశారు. 'నా దంతాల కంటే ఈ చేపవే బాగున్నాయి'అని, 'చేప దంతాలను శుభ్రం చేయడానికి నాకు బాగా తెలిసిన డెంటిస్ట్ ఉన్నాడు'అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
అనంతరం దీన్ని 'షీప్‌షేడ్' అనే చేప జాతికి చెందినదిగా గుర్తించారు. దీని దంతాలు చూడటానికి షీప్ (గొర్రె) దంతాలవలె ఉండటం వల్ల ఈ చేపకు ఆ పేరు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:మనవరాలి కోసం మోడల్‌గా మారిన బామ్మ