తెలంగాణ

telangana

ETV Bharat / international

చంద్రునిపై దిగే తొలి మహిళ ఈ 9 మందిలో ఎవరు?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)... 2024లో చంద్రున్ని చేరే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మిషన్​లో భాగంగా 18 మంది వ్యోమగాములతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

First woman, next man on moon will come from these NASA 18
చంద్రుని చేరడమే లక్ష్యంగా నాసా 'ఆపరేషన్​ ఆర్టెమిస్​'

By

Published : Dec 10, 2020, 1:31 PM IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' తన 'ఆర్టెమిస్​ మిషన్'లో భాగంగా.. 2024లో చంద్రుడ్ని చేరేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగం కోసం ఎంపికైన 18 మంది వ్యోమగాముల పేర్లను తాజాగా వెల్లడించింది. వీరిలో 9 మంది మహిళలు ఉండడం విశేషం. వీరిలో ఒకరు... జాబిల్లిపై కాలుమోపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.

ఈ వ్యోమగాముల బృందాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​.. జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో పరిచయం చేశారు. ఫ్లొరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ఈ సమావేశం... మండలి ఛైర్మన్​గా పెన్స్​కు చివరిది.

ఇదీ చదవండి:చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?

2024 నాటికి జాబిల్లిని చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది నాసా. అయితే.. పాలనా యంత్రాంగంలో మార్పులు, ఇతర పరిస్థితుల ప్రభావం దృష్ట్యా.. ఈ ప్రయోగంపై సందిగ్ధం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details