తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్- బైడెన్ ఢీ అంటే ఢీ.. తొలి చర్చ అప్పుడే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల అభ్యర్థుల మధ్య ఆసక్తికర చర్చలు సెప్టెంబర్ 29 నుంచి మొదలుకానున్నాయి. దేశ అభివృద్ధికి సంబంధించి ఇరు నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది.

trump
అధ్యక్ష సమరం టీ20: త్వరలో ట్రంప్- బైడెన్ ఢీ అంటే ఢీ

By

Published : Jul 28, 2020, 9:25 AM IST

Updated : Jul 28, 2020, 9:55 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే గుర్తొచ్చేది ఇద్దరు అభ్యర్థుల మధ్య చర్చ. మిగతా దేశాలతో పోలిస్తే ఇది విలక్షణంగా కనిపిస్తుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య దేశ అభివృద్ధి దిశగా జరిగే చర్చ సందర్భంగా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడిస్తుంటారు. వారి వాదనలకు తమ ప్రత్యర్థి నుంచి ఖండనలు కూడా ఉంటాయి. రసవత్తరంగా జరిగే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.

"ఇద్దరు అభ్యర్థుల మధ్య తొలి చర్చకు వెస్టర్న్ రిజర్వ్ యూనివర్శిటీ, క్లేవ్​ల్యాండ్ క్లినిక్​లు ఆతిథ్యమిస్తాయి. క్లేవ్​ల్యాండ్​లోని హెల్త్​ ఎడ్యూకేషన్ క్యాంపస్​లో సెప్టెంబర్ 29న కార్యక్రమం జరుగుతుంది."

-అభ్యర్థుల చర్చ కమిషన్ ప్రకటన

ఈ చర్చల సందర్భంగా డెమొక్రాట్ల నుంచి అభ్యర్థిగా నిలిచిన మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ దేశ అభివృద్ధిపై చర్చిస్తారు. రెండో చర్చ కార్యక్రమం అక్టోబర్ 15న మియామిలోని అడ్రెయిన్ ఆర్స్ సెంటర్​లో, మూడో చర్చ టెన్నెస్సీలోని బెల్​మోంట్ విశ్వవిద్యాలయం వేదికగా అక్టోబర్ 22న జరుగుతాయి.

ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఉటాహ్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 7న చర్చ జరగనుంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, త్వరలో ప్రకటించబోయే డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి మధ్య ఈ సంవాదం జరగనుంది.

అన్ని చర్చలు రాత్రి 9 నుంచి 10.30 గంటల మధ్య 90 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

ఇదీ చూడండి:చైనా సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలు

Last Updated : Jul 28, 2020, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details