తెలంగాణ

telangana

ETV Bharat / international

మహిళ చేతికి 'అణ్వాయుధ నౌక' బాధ్యతలు.. నేవీ చరిత్రలోనే తొలిసారి

First female aircraft carrier commander: అణ్వాయుధ వాహక నౌకకు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా కెప్టెన్​గా రికార్డు సృష్టించారు అమెరికా నౌకాదళ అధికారిని అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​. శాన్​డియాగోలో మోహరించిన యూఎస్​ఎస్​ అబ్రహం లింకన్​ న్యూక్లియర్​ క్యారియర్​కు ఆమె సారథ్యం వహిస్తున్నారు.

US nuclear carrier
అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​

By

Published : Jan 5, 2022, 1:41 PM IST

First female aircraft carrier commander: అమెరికాకు చెందిన 'యూఎస్​ఎస్​ అబ్రహం లింకన్​' అణ్వాయుధ వాహన నౌకను శాన్ డియాగోలో మోహరించారు. ఈ నౌకకు కెప్టెన్​ అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అమెరికా నౌకాదళ చరిత్రలో న్యూక్లియర్​ క్యారియర్​కు నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

అబ్రహం లింకన్​ క్యారియర్​ స్ట్రైక్​ గ్రూప్​లో భాగంగా.. నావెల్​ ఎయిర్​ స్టేషన్​ నార్త్​ ఐలాండ్​ నుంచి గత సోమవారం శాన్​డియాగోలో ఈ నౌకను మోహరించారు.

అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​

అబ్రహం లింకన్​ నౌక ఎగ్జిక్యూటివ్​ అధికారిగా 2016-2019 వరకు విధులు నిర్వర్తించారు అమీ. నౌక నాయకత్వ బాధ్యతలను కెప్టెన్​ వాల్ట్​ స్లాటర్​ నుంచి గత ఏడాది ఆగస్టులో స్వీకరించారు. ఈ సందర్భంగా కెప్టెన్​ స్లాటర్​కు కృతజ్ఞతలు తెలిపారు. 'దేశాన్ని రక్షించేందుకు మనల్ని ఎంచుకున్న ప్రజల సంరక్షణ మనకు అప్పగించారని తెలుసుకోవటం కంటే బాధ్యత మరొకటి లేదు. నౌకాదళంలోని అత్యున్నతమైన నౌకకు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు కెప్టెన్​ స్లాటర్​కు కృతజ్ఞతలు.' అని పేర్కొన్నారు అమీ.

అంతకు ముందు హెలికాప్టర్​ మారిటైం స్ట్రేక్​ స్క్వాడ్రన్​ 70లో కమాండింగ్​ అధికారిగా పని చేశారు అమీ. ఆమె ఉద్యోగ జీవితంలో 3,000 గంటలు విమానాలను నడిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదీ చూడండి:'అమెరికా ఆరోపణలు తప్పు.. మా వద్ద అన్ని అణ్వాయుధాలు లేవు!'

ABOUT THE AUTHOR

...view details