అమెరికాలో పరీక్షించిన మొదటి కొవిడ్ వ్యాక్సిన్ ఆశించిన విధంగానే ప్రజల రోగనిరోధక శక్తిని పునరుద్ధరించిందని పరిశోధకులు వెల్లడించారు. దీనితో కీలకమైన తుది పరీక్షకు రంగం సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు.
"కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు తెలిపారు. ఇది నిజంగా శుభవార్త."
- డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు
మార్చి నెలలో 45 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. ఈ అధ్యయనంలో రోగుల రోగనిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ పెంచినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
భారీ ప్రయోగం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడెర్నాలోని ఫౌసీ సహచరులు ఈ కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. జులై 27న దీనిపై కీలకమైన తుది పరీక్ష ప్రారంభమవుతుంది. ఈ బృహత్ అధ్యయన కార్యక్రమంలో 30,000 మంది వలంటీర్లు పాల్గొననున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
సైడ్ ఎఫెక్ట్స్
ఈ కొవిడ్ వ్యాక్సిన్‌ను.. రోగికి ఒక నెల వ్యవధిలో రెండు సార్లు ఇస్తారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పెద్ద దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లలో సగం మందికిపైగా... అలసట, తలనొప్పి, చలి, జ్వరం, ఇంజక్షన్ వేసిన చోట నొప్పి ఉన్నట్లు తెలిపారు. కొంచెం ఎక్కువ డోసు తీసుకున్నవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
కొంత మందిలో కరోనా లక్షణాలు లాంటివే కనిపించాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమేనని, వ్యాక్సిన్ వేసిన కొద్ది సేపు మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తానికి వ్యాక్సిన్ కరోనా మహమ్మారిని ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదిరించగలుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:దేశీయ కరోనా వ్యాక్సిన్లకు 'హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్'