తెలంగాణ

telangana

ETV Bharat / international

'వచ్చే నెలలోనే అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్​'

డిసెంబర్​ రెండో వారంలోనే కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అమెరికా యోచిస్తోంది. ఫైజర్​, బయోఎన్​టెక్​ సంయుక్తంగా రూపొందిస్తోన్న కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​.. ఎఫ్​డీఏ ఆమోదం పొందిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాక్సిన్​ ప్రోగ్రామ్​ హెడ్​ మాన్సెఫ్​ స్లావీ తెలిపారు.

First Americans could be vaccinated next month: House vaccine chief
'వచ్చే నెలలోనే అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్​'

By

Published : Nov 23, 2020, 4:00 PM IST

అమెరికా ప్రభుత్వం డిసెంబర్ ఆరంభంలోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టు శ్వేతసౌధం వ్యాక్సిన్​ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికన్​ ఫార్మా దిగ్గజం ఫైజర్​, జర్మన్​ సంస్థ బయోఎన్​టెక్​ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​.. అత్యవసర వినియోగం కోసం.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ)కు దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్​ ఆమోదంపై చర్చించేందుకు ఎఫ్​డీఏ​ అడ్వైజరీ కమిటీ డిసెంబర్​ 10న సమావేశం కానుంది.

ఒక్కసారి ఎఫ్​డీఏ ఆమోదం లభిస్తే.. మరుసటి రోజే టీకాల పంపిణీ ప్రారంభించాలనే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు అమెరికా కరోనా వైరస్​ వ్యాక్సిన్​ ప్రోగ్రామ్​ హెడ్​ డా. మాన్సెఫ్​ స్లావీ. వచ్చే ఏడాది మే లోగా అమెరికా జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్​ అందిస్తామని పేర్కొన్నారు.

''ఎఫ్​డీఏ ఆమోదం పొందిన 24 గంటల్లోగా వ్యాక్సిన్లను ఇమ్యునైజేషన్​ సైట్లకు పంపాలని చూస్తున్నాం. ఇదే జరిగితే డిసెంబర్​ 11-12 మధ్య టీకాలు అక్కడికి చేరుకుంటాయి.''

- డా. మాన్సెఫ్​ స్లావీ, యూఎస్​ కరోనావైరస్​ వ్యాక్సిన్​ ప్రోగ్రామ్​ హెడ్​

ఫైజర్​ అభివృద్ధి చేసిన క్యాండిడేట్ వ్యాక్సిన్​​.. రెండు డోసులుగా ఇస్తారు. మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ అనంతరం.. తమ వ్యాక్సిన్ ‌కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఈ ఫార్మా సంస్థ.. ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది చివర్లోగా 50 మిలియన్​ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి: గుడ్​న్యూస్​: ఫైజర్​ టీకా 95 శాతానికిపైగా ప్రభావవంతం

మోడెర్నా కూడా..

అమెరికాలోనే మరో సంస్థ.. మోడెర్నా కూడా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను అభివృద్ధి చేస్తోంది. రాబోయే వారాల్లో ఇది ఎఫ్​డీఏ ఆమోదం పొందుతుందని భావిస్తోంది. మోడెర్నా టీకా కూడా.. 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది.

ఇదీ చూడండి:మోడెర్నా టీకా పనితీరు అద్భుతం: ఫౌచీ

అమెరికాలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. జాన్స్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ ప్రకారం దేశంలో 12 మిలియన్లకుపైగా కరోనా సోకింది. మరో 2 లక్షల 55 వేల మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details