అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని 25 అంతస్తుల నివాస భవంతిలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుంది. భవనంలో చిక్కుకున్న వారు దూకేందుకు గాలి బ్యాగులను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్లతో సాయంతో కొంత మందిని రక్షించారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.
ఈ భవనానికి కొద్ది దూరంలోని మరో భవంతిలో మరో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.