అమెరికాలో త్వరలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న జో బైడెన్.. ముందుగా ప్రకటించిన విధంగానే కరోనాను కట్టడికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రజారోగ్య నిపుణులతో ఓ సలహా మండలిని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ట్రంప్ తొలగించిన అధికారులనే సభ్యులుగా తీసుకున్నారు బైడెన్. మొత్తం 10మందితో ఈ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ట్రంప్ తొలగించిన అధికారులే బైడెన్‌కు సలహాదారులు - corona task force america latest news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించిన అధికారులను నూతన బాధ్యతల్లో కూర్చోబెట్టారు జో బైడెన్. వారందరికీ ప్రత్యేక సలహా మండలిలో చోటిచ్చారు. ఇందులో భారతీయ అమెరికన్ డా. వివేక్ మూర్తికి కీలక స్థానం కల్పించారు బైడెన్.
ట్రంప్ తొలగించిన అధికారులతోనే కరోనా ప్రత్యేక కార్యదళం
వివేక్ మూర్తికి కీలక స్థానం..
ఈ బృందానికి భారతీయ అమెరికన్ డా.వివేక్ మూర్తి(42) నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు డా.రిక్ బ్రైట్, డా. డేవిడ్ కెస్లర్, డా. మార్సెల్లా నునెజ్-స్మిత్‌లు కీలకపదవుల్లో ఉండనున్నారు. 2014 నుంచి 2017 వరకు అమెరికా సర్జన్ జనరల్‌గా డా.మూర్తి పనిచేశారు.