వెనెజువెలాలో మంటలను ఆసరాగా తీసుకొని జంతువుల వేటకు వెళ్లిన 11 మంది యువకులు అగ్నికీలల్లో చిక్కుకుని మరణించారని సమచారం. ఈ మేరకు వెనెజువెలా అటార్నీ జనరల్ తారిక్ విలియం ప్రకటన విడుదల చేశారు.
వెనెజువెలాలో 11మంది ప్రాణం తీసిన వేట! - International news in telugu
వెనెజువెలాలో జంతువుల వేటకు వెళ్లిన 11 మంది యువకులు మంటలు అంటుకుని మృతి చెందారని సమాచారం. ఆరాగ్వాలోని ఓ చెరుకుతోట అగ్నికి ఆహుతవుతున్న నేపథ్యంలో దావానలం నుంచి దూరంగా పారిపోతున్న కుందేలు, ఉడుము వంటి వాటిని పట్టుకునేందుకు వెళ్లిన యువకులకు మంటలు అంటుకున్నాయని వెనెజువెలా అధికారులు వెల్లడించారు.

వెనెజువెలాలో 11మంది ప్రాణం తీసిన వేట!
ఆరాగ్వా రాష్ట్రంలోని కాగ్వా ప్రాంతంలో చెరుకు తోటకు మంటలు అంటుకున్నాయని తెలిపారు తారిక్. దీన్ని ఆసరాగా తీసుకుని కుందేళ్లు, ఉడుములను వేటాడేందుకు యత్నించిన యువకులు బలమైన గాలులతో మంటలు తీవ్రమయిన నేపథ్యంలో అగ్నిలో చిక్కుకుపోయారని వెల్లడించారు. ఇలా మంటలను ఆధారంగా చేసుకుని దశాబ్దాలుగా కొంతమంది వేట సాగిస్తున్నారని తారిక్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'హ్యూస్టన్'లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
Last Updated : Feb 18, 2020, 7:52 AM IST