అమెరికా టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీర్ పార్క్‌లోని ఇంటర్ కాంటినెంటల్ చమురు రసాయన సంస్థలోని ఓ ట్యాంకులో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
అగ్నిప్రమాదం జరిగిన చోట మొత్తం 13.1 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉన్నట్లు అంచనా. మంటలు ఇతర ట్యాంకులకూ విస్తరిస్తే మరింత ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. చుట్టుపక్కల వారు బయటకు రావద్దని కోరారు.