అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? ఆర్భాటంగా, అట్టహాసంగా, అత్యంత భద్రంగా... కానీ ఆమె అలా లేరు. ఓ టీచర్‌గా రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెబుతూ ఉన్నారు. ఎందుకిలా అంటే 'నేను టీచర్ కాలేదు... టీచర్‌గా పుట్టాను' అంటారామె. ఇప్పుడు దేశానికే ప్రథమ మహిళ అయినా 'నేను ఉపాధ్యాయినిగానే కొనసాగుతా' అంటున్న జిల్ ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్.
జిల్‌బైడెన్ తన జీవితం గురించి ట్విటర్ ఖాతాలో రెండే రెండు ముక్కల్లో క్లుప్తంగా చెప్పుకున్నారు. 'నేనో జీవితకాల విద్యావేత్తని. భార్యని, అమ్మని, చెల్లిని'. ఆమె చెప్పినట్టుగా తన జీవితంలో రెండే విషయాలకి ప్రాధాన్యం ఇచ్చారామె. ఒకటి తానేంతో ప్రేమించే ఉపాధ్యాయవృత్తికి. రెండు కుటుంబానికి. జిల్ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి జీవితాంతం కట్టుబడి ఉంటారు. ఆ విషయాన్ని ఆమె జీవితమే స్పష్టంగా చెబుతోంది. జిల్‌ని కలిసిన తర్వాత రెండేళ్ల కాలంలో ఐదుసార్లు 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగారు బైడెన్. కానీ ఆమె ఏ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నారు.
ఓ బ్లైండ్ డేట్లో బైడెన్ కలిసిన మొదటిరోజే 'అమ్మా నేను మొదటిసారి ఓ జెంటిల్మెన్ని కలిశాను తెలుసా?' అంటూ సంబరంగా అర్ధరాత్రి ఫోన్ చేసి తన తల్లికి చెప్పారామె. అటువంటి అమ్మాయి 'పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే' అనే ఓ నిర్ణయానికి రావడానికి రెండేళ్లు ఎందుకు పట్టినట్టు అనే అనుమానం రావొచ్చు. "బైడెన్‌ని మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. కోటు వేసుకొని డేటింగ్‌కి వచ్చిన ఆయన్ని చూసి నవ్వొచ్చింది. ఆయనతో కలిసి సినిమాకి వెళ్లొచ్చేలోపు అతనేంటో అర్థమయ్యింది." అదే విషయాన్ని మా అమ్మతో సంతోషంగా చెప్పాను అని జిల్ అన్నారు.
జిల్‌ని 'ఫిల్లీగర్ల్', 'టఫ్కుకీ' అని కూడా అంటారు. ఫిలడెల్ఫియాలో పెరిగిన అమ్మాయిలను ఫిల్లీగర్ల్ (ఫిలడెల్ఫియా పవర్గర్ల్) అని, ఎవ్వరికీ కొరుకుడు పడకుండా ఉండే అమ్మాయిలను టఫ్కుకీ అని ముద్దుగా పిలుచుకుంటారు.
పనిమనిషిలా వెళ్లి... పాఠాలు చెప్పి