పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లను చెల్లని వాటిగా గుర్తించాలని ట్రంప్ వేసిన దావాను ఫెడరల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాథ్యూ బ్రాన్ ధర్మాసనం.. పెన్సిల్వేనియాలో ఏ ఒక్క ఓటును వృథాగా పోనివ్వబోమని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ట్రంప్ వాదనను కొట్టి పారేసింది. ట్రంప్ వర్గం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఇటీవల జస్టిస్ మాథ్యూ అన్నారు.
"ఆరో అతిపెద్ద రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ఏ ఒక్క ఓటను చెల్లనివాటిగా పరిగణించలేం. ఇక్కడ పోలైన 70 లక్షల ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నారు. ఎన్నికల్లో గందరగోళం జరిగిందని ఆరోపిస్తున్నారు. కానీ, అందుకు సంబంధించి సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. "
-- జస్టిస్ మాథ్యూ బ్రాన్, పెన్సిల్వేనియా కోర్టు ప్రధాన న్యాయమూర్తి